Chiranjeevi: ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ఒరిజినల్ ట్రైలర్ చూస్తుంటే ‘వకీల్ సాబ్’..‘న్యాయం కావాలి’ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త తరహా సినిమాలను అభినందిస్తూ వాటికి తన వంతు సపోర్ట్‌ను అందించే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరోసారి ఓ న్యూ కాన్సెప్ట్ కంటెంట్‌కు అండగా నిలిచారు. అదే ‘అబ్జెక్షన్ మై లార్డ్’. ఈ ఒరిజినల్ ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ నటుడు శ్రీకాంత్ మేకా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఛానెల్ జీ5లో జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వైవిధ్యమైన సినిమాలు, సిరీస్, షోస్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న జీ5 తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ అనే కోర్ట్ డ్రామాతో మెప్పించటానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా మేకర్స్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ అనే ఒరిజినల్ ట్రైలర్‌ను బుధవారం రోజున రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా..
ఆయన మాట్లాడుతూ ‘‘‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్‌ను రిలీజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే గతంలో వకీల్ సాబ్ సినిమా గుర్తుకు వస్తుంది. అలాగే ఇంకా వెనక్కి వెళితే నేను నటించిన నా చిత్రం న్యాయం కావాలి గుర్తుకు వస్తుంది. ఎప్పుడైనా కోర్ట్ డ్రామాలను డైరెక్టర్ సంతోష్‌లాగా తీయగలిగితే తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనటంలో సందేహం లేదు. హిందీ, తెలుగు, తమిళ ఇలా ఏ భాషలోనైనా ఇలాంటి సినిమాలు హిట్ అవుతుంటాయి. జీ5కి ఏ 7 ఎపిసోడ్స్ సిరీస్ హిట్ అవుతుందని, వారికి మంచి వ్యూయర్ షిప్‌ను తీసుకువస్తుందని నమ్ముతున్నాను. టెక్నీషియన్స్ పరంగా చూస్తే.. అర్జున్ సురవరం సినిమాను రూపొందించారు.ఆ ఇసనిమా నిర్మాత విషయానికి వస్తే నా మిత్రుడు, అనుంగుడు, ఎప్పుడూ నా పక్కనే ఉండే వ్యక్తి, ఇంకా చెప్పాలంటే నా దళపతి, తమ్ముడులాంటి రాజ్ కుమార్ ఆకెళ్ల చేశాడు. మళ్లీ ఈ ఒరిజినల్ చేశారు. అర్జున్ సురవరం లాగానే నేటి ట్రెండ్‌కు తగినట్లు రూపొందిన అబ్జెక్షన్ మై లార్డ్ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. తప్పకుండా హిట్ అవుతుంది. కెమెరామెన్ సూర్య ఎక్స్లెంట్ టెక్నీషియన్. నా తమ్ముడు శ్రీకాంత్ ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటూ ఉంటాడు. పంథాను మార్చుకుంటూ.. మంచి పెర్ఫామెన్స్‌కు అవకాశం ఉందంటే విలన్‌గా కూడా చేయటానికి ఆలోచించడు. ఎల్లలు లేకుండా తనని తాను ఎక్స్పెండ్ చేసుకుంటున్నాడు. తనొక వండర్ఫుల్ పెర్ఫామర్. ఈ ట్రైలర్‌ను గమనిస్తే తన పాత్ర పరంగా పడే బాధ, ఎమోషన్‌ను అద్భుతంగా పలికించాడు. 19 రోజుల్లోనే ఈ 3 గంటల సిరీస్‌ను చేయటం అనేది గొప్ప విషయం. అనన్య, స్నేహల్ కూడా బెస్ట్ ఇచ్చి ఉంటారనుకుంటున్నాను. అలాగే నా తమ్ముడు సమీర్.. తను కూడా మంచి రోల్ చేశాడు. ముఖేష్ రుషిగారు చాలా మంచి పాత్రలో కనిపించారు. రాజ్‌కుమార్, సంతోష్ చక్కగా ఫ్రేమ్ చేసుకుని మంచి ఒరిజినల్ చేశారు. అబ్జెక్షన్ మై లార్డ్ అనే సిరీస్ జీ5లో జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీ5 వారికి అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, సమీర్, అనన్య, స్నేహాల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read
సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ ఒరిజినల్‌ను రూపొందించారు. ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ఒరిజినల్‌కు అరుణ్ చిలువేరు సంగీతం అందించగా..సూర్య సినిమాటోగ్రఫీ అందించారు.
తాజావార్తలు
-
Bitchat: సీజేపీ నిరసనల్లో ఉపయోగించిన ‘‘బిట్‌చాట్’’ యాప్‌పై కేంద్రం చర్యలు..
-
Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
-
CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్‌పై సూర్యకాంత్ కీలక ప్రకటన
-
Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
-
Lothukunta Land Case: లోతుకుంట భూముల కేసులో హైడ్రాకు హైకోర్టు షాక్..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!