NTV Telugu Site icon

నటి పావలా శ్యామలకు చిరంజీవి ఆర్థిక సాయం

నటి పావలా శ్యామల దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి మరోసారి సాయం చేశారు. గతంలో పావ‌ల శ్యామ‌ల స‌రైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు చిరంజీవి 2ల‌క్ష‌లు రూపాయలు సాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. కుమార్తె శ్రీ‌జ చేతుల‌మీదుగా ఈ సాయం చేశారు. తాజాగా ఆమె పరిస్థితిపై వస్తున్న వార్తలు చూసిన చిరు మరోసారి ఆర్థిక సాయాన్ని అందించారు. ఆమెకు రూ. 1 ల‌క్షా 1500 లను అందించారు. అంతేకాదు ‘మా’ సభ్యత్వం ఇప్పించి, ఆమెకు ప్రతి నెలా ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తానన్నారు. దీంతో శ్యామల తన సంతోషాన్ని వ్యక్తంచేస్తూ.. మ‌న‌స్ఫూర్తిగా చిరంజీవికి ధ‌న్య‌వాదాలు తెలియజేశారు.