NTV Telugu Site icon

Chiranjeevi : మెగాస్టార్ 157 స్టోరి రెడీ..దర్శకుడు ఎవరంటే..?

Untitled Design (11)

Untitled Design (11)

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభ‌ర’. బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ట చిరు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ కు జోడిగా అందాల భామ త్రిష నటిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్నియువి క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల ప్రారంభించారు ఆస్కార్ విన్నర్ MM కీరవాణి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు నిర్మాతలు.

ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ చివరి దశలో ఉండగా చిరు తర్వాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. చిరు కెరీర్ లో 157వ చిత్రంగా రానుంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చెన్నై లో శరవేగంగా జరుగుతోంది. రచయిత కమ్ డైరెక్టర్ బివిఎస్ రవి ఈ చిత్రానికి కథా సహకారం అందించనున్నాడు. గతంలో మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు మోహన రాజా చిరు 157 చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ ఈ సినిమా లో పెళ్లి అయిన మధ్య వయస్కుడి గా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చిరు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ లో రానున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ ముద్దుల తనయ కొణిదల సుస్మిత నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఈ ఏడాదిలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Also  Read: Nani : భారీ స్థాయిలో దసరా -2 ..బడ్జెట్ ఎంతంటే..?

Show comments