Site icon NTV Telugu

Tollywood Bundh : బంద్ పై మెగా పంచాయితీ.. తీర్పు ఆమోదయోగ్యంగా ఉంటుందా?

Chiru

Chiru

టాలీవుడ్ షూటింగ్ బంద్ వ్యవహారం ఇప్పుడు చిరు ఇంటికి చేరింది. నేడు చిరు ఇంట్లో  ప్రొడ్యూసర్స్ Vs ఫెడరేషన్ పంచాయతీ జరగబోతుంది. ప్రొడ్యూసర్స్ అభిప్రాయం తెలుసుకుని వారి ఫైనల్ నిర్ణయం ఏంటనే దానిపై వివరణ తీసుకోబోతున్నారు చిరంజీవి. నేడు ప్రొడ్యూసర్స్ సైడ్ నుండి వివరణ తీసుకుని రేపు ఫెడరేషన్ నాయకులతో చిరంజీవి సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరు వర్గాల అభిప్రాయం తెలుసుకున్న తరువాత మంగళవారం ప్రొడ్యూసర్స్ మరియు ఫెడరేషన్ నాయకులతో మెగాస్టార్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.

Also Read : Bengal Files : మరో కాంట్రవర్సీకి తెరలేపుతున్న’బెంగాల్ ఫైల్స్’

టాలీవుడ్ లో గత 14 రోజులుగా సినిమా కార్మికుల సమ్మె జరుగుతోంది. స్టార్ హీరోల సినిమాల దగ్గర నుండి చిన్న సినిమాల వరకు అన్నిసినిమాలు షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బంద్ స్టార్ట్ అయిన రోజు నుండి నిర్మాతలకు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎటు తేలకుండానే ముగిశాయి. ఈ పరిణామం ఇలానే కొనసాగితే చిత్ర పరిశ్రమకు మరింత నష్టాలు వస్తాయని భావించి మెగా స్టార్ రంగంలోకి దిగారు. చిరంజీవి జోక్యంతో సమ్మె పై సందిగ్ధత తొలుగుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా నిర్మాతలు నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఫెడరేషన్ నేతలు మండిపడుతున్నారు. చర్చలు లోపల ఒకలాగ జరిగితే బయట ఒకలాగ ప్రజెంట్ చేస్తున్నారు, వేతనం పెంపు డిమాండ్లపై నిర్మాతలు త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు ఫెడరేషన్ నాయకులు. చర్చలతో ఫలితం లేకపోవడంతో నిరసన బాట పట్టేందుకు రెడీ అవుతున్న కార్మిక సంఘాలు. మరోవైపు ఫెడరేషన్ నేతలు తమ కండిషన్స్ ఒప్పుకోవట్లేదు అంటూ నిర్మాతలు తెలిపారు. మరి చిరు జోక్యంతో ఈ పంచాయతిలో తీర్పు వెలువడుతుందా లేదా వాయిదా పడుతుందా చూడాలి.

Exit mobile version