NTV Telugu Site icon

ఏప్రిల్ 30న అమెజాన్ లో ‘వకీల్ సాబ్’

Meet Vakeel Saab On Prime on April 30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని సినిమాల కంటే ఫస్ట్ డే కలెక్షన్లలో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకుంది. అయితే… ప్రీమియర్ షోస్ అనుకున్న విధంగా పడకపోవడం, టిక్కెట్ రేట్ల పెంపుదలకు ప్రభుత్వాలు అంగీకరించకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల పై కొంత ప్రభావం పడింది. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్ సైతం మొదలు కావడంతో ఆంధ్రాలో థియేటర్ల ఆక్యుపెన్సీపై నిబంధనలు విధించారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించారు. దాంతో చాలా థియేటర్ల యాజమానులు స్వచ్ఛందంగా తమ థియేటర్ల ను మూసి వేశారు. అయినా కొద్ది రోజులుగా ‘వకీల్ సాబ్’ను కొన్ని థియేటర్లలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత ‘దిల్’ రాజు అమెజాన్ ప్రైమ్ కు స్ట్రీమింగ్ హక్కులు ఇవ్వడం విశేషం. ఇదే నెల 30న ‘వకీల్ సాబ్’ అందులో ప్రసారం కాబోతోంది. కరోనాకు భయపడి థియేటర్లకు రాలేకపోయిన వారికి ‘వకీల్ సాబ్’ చూసే ఆస్కారం ఈ రకంగా కలుగుతోంది. మరి ఓటీటీలో ‘వకీల్ సాబ్’ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.