టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్‌గా మారడానికి ట్రై చేస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. అప్పటి వరకు నార్మల్ హిట్‌లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఒక్కసారిగా రూ.100 కోట్ల హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. కానీ ఏం లాభం ఆమె అనుకున్న రోల్స్ ఆమెకు రావడం లేదు. వరుస పెట్టి అని తూతూ మంత్రం పాత్రలే వస్తున్నాయి. సాధారణంగా హీరోయిన్స్ తాము అనుకున్న రోల్స్ రాకపోతే వచ్చిన రోల్స్ తో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు మీనాక్షి పరిస్థితి కూడా అలాగే ఉంది..
Also Read : Rajinikanth : నా భార్య ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నా..
కానీ ఎక్కడ కూడా తగ్గకుండా నిరుత్సాహ పడకుండా..కాంప్రమైజ్ అవుతూ తాను అనుకున్న రోల్స్ కోసం కష్టపడుతుంది. అయితే అందంగా ఉన్నప్పటికీ చాలా మంది హీరోయిన్ కి ఏదో ఒక విషయంలో ఛాన్స్‌లు ఆగిపోతుంటాయి. వచ్చినట్లే వచ్చి చేయి జారి పోతుంటాయి. ఇక మీనాక్షి చౌదరి కూడా అందంగా ఉన్నప్పటికి ఇండస్ట్రీలో పెద్ద అవకాశాలు రావడం లేదు. అయితే ఆమె మరీ సన్నగా ఉండడం .. అందులోను అటూ ఇటూ కాకుండా ఆమె హైట్ ఏ హీరోకి సెట్ కాకుండా ఉండటమే ఇందుకు కారణం అంటున్నారు జనాలు. ఆ కారణంగానే పాన్ ఇండియా స్టార్స్ ఆవిడని సినిమాలో తీసుకోవాలి అంటే భయపడుతున్నారని సమాచారం. దీంతో మీనాక్షి ఫ్యాన్స్ కూడా అవుననే అంటున్నారు. హీరోయిన్స్ స్లిమ్ గా ఉండాలి కానీ మీనాక్షి చౌదరి మరి స్లిమ్ గా ఉంది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు కాస్త బోదుగా తయ్యారు అవ్వలని ట్రై చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
