టాలీవుడ్‌లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మీనాక్షి చౌదరి ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో, మీనాక్షికి కొత్త అవకాశాల వర్షం కురుస్తోంది. ఇక ఇప్పుడు ఆమె కెరీర్‌లో మరో మైలురాయి చేరువలో ఉంది.
ప్రజంట్ టాలీవుడ్ లో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ లు అంతా బాలీవుడ్ బాట పడుతున్నారు. తాజాగా ఇప్పుడు మీనాక్షి కూడా ఈ లిస్ట్ లో చేరబోతుంది.. బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ‘ఫోర్స్ 3’ సినిమాలో మీనాక్షి హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకుడు భావ్ ధూలియా తెరకెక్కించబోతున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. లుక్ టెస్ట్ తర్వాతే మీనాక్షి ఈ సినిమాలో ఫైనల్ అయిందని తెలిసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించేందుకు మీనాక్షికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారట.
ఫోర్స్ 3 చిత్రాన్ని నవంబర్‌లో సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మీనాక్షి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే, ప్రస్తుతం మీనాక్షి నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. వరుస ప్రాజెక్టులు, ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ ఈ క్రమంలో మీనాక్షి కెరీర్ జోరులో కొనసాగుతోంది. మొత్తం మీద, దక్షిణాది విజయాల తర్వాత ఇప్పుడు మీనాక్షి హిందీ తెరపై అదృష్టాన్ని పరీక్షించు కాబోతున్నారు. మరి ఈ బాలీవుడ్ డెబ్యూ ఆమెకు స్టార్‌డమ్ మరింత పెంచుతుందా అన్నది చూడాలి.
