టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌ల్లో భాగమవుతూ గుర్తింపు తెచ్చుకుంటున్న నటి మీనాక్షి చౌదరి, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ రోల్‌లో కనిపించబోతోంది. నాగ చైతన్య హీరోగా, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్‌కి తాత్కాలికంగా “NC24” అనే టైటిల్ నిర్ణయించారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె ‘దక్ష’ అనే పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో కనిపించబోతుంది. పోస్టర్‌లో మీనాక్షి ఒక చీకటి గుహలో ఏదో రహస్యాన్ని కనుగొంటున్నట్లు చూపించడం ప్రేక్షకుల్లో కుతూహలం రేపుతోంది. ఆమె లుక్‌లో ఉన్న సీరియస్‌నెస్, రహస్య వాతావరణం ఈ సినిమాకు మిస్టరీ టచ్ ఇచ్చాయి.
Also Read : Rashmika : ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపిస్తూ.. మొత్తానికి ఓపెన్ అయిన నేషనల్ క్రష్!
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, సుకుమార్ సమర్పణలో వస్తుంది. ఈ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తుండగా, ఆయన మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు హైలైట్‌గా మారనుంది. ఇక ‘లాపాటా లేడీస్’ ఫేమ్ నటుడు స్పార్ష్ శ్రీవాస్తవ ఈ ప్రాజెక్ట్ ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే టెక్నికల్ టీమ్, కథాంశం, నటీనటుల కాంబినేషన్ వల్ల ఈ సినిమా పట్ల అంచనాలు పెరిగిపోయాయి. మీనాక్షి చౌదరి ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లో కనిపించినా, ఈసారి ఆమె రోల్ పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని యూనిట్ చెబుతోంది. దీంతో దక్ష పాత్ర ద్వారా ఆమె నటనలో కొత్త కోణం చూపించబోతోందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
