భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా మంచి ఆఫర్లు అందుకుంటుంది. ఇందులో భాగంగా సంక్రాంతి బరిలో ఉన్న ‘ సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరో సక్సెస్ అందుకోడానికి సిద్ధం అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఎంత జోరుగా జరుగుతున్నాయి. మీనాక్షి కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గోంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది. మనకు తెలిసి నటినటులను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం చూస్తూనే ఉంటాం.
Sreemukhi: రామలక్షణులపై వ్యాఖ్యలు.. క్షమించమని యాంకర్ శ్రీముఖి వేడుకోలు
కొంత మంది పట్టించుకోనప్పటికీ మరి కొంత మంది నటీమణులు మాత్రం వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటారు. అయితే మీనాక్షి కూడా సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కారణంగా మనస్థాపానికి గురయ్యానని చెప్పుకొచ్చింది. అంతే కాదు వారం రోజుల పాటు డిప్రెషన్ లో వెళ్ళినట్లుగా ఆమె తెలిపింది.. అలాగే ‘ది గోట్’ మూవీలో తన యాక్టింగ్ పై చేసిన ట్రోల్స్ తనని ఎంతో బాధించినట్లు తెలిపింది మీనాక్షి. ప్రస్తుతం ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.