సుదీర్ఘ విరామం తర్వాత గదర్ 2తో మాస్ క్రేజ్ మళ్లీ తెచ్చుకున్న సన్నీ డియోల్, లేటెస్ట్‌గా తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన జాట్తో బాలీవుడ్‌లో మరో సక్సెస్ కొట్టేశాడు. ఒకవైపు నాస్టాల్జిక్ గదర్ 2. మరోవైపు మాస్ కమర్షియల్ జాట్ – ఈ రెండు సినిమాలు కలిపి ఆయన కెరీర్‌లోని సెకండ్ ఇన్నింగ్స్ కి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాయి.
Also Read : Kollywood : స్టార్ హీరో నిర్మాణ సంస్థ లాంఛ్ కు కదిలొచ్చిన స్టార్స్
ఇప్పుడు బాలీవుడ్ యాక్షన్ లెజెండ్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావడంతో ఫ్యాన్స్ హైప్ పీక్స్ లో ఉంది! జాట్ సక్సెస్ తర్వాత, వచ్చే జనవరి 23న రిలీజ్ అవుతున్న బోర్డర్ 2తో బజ్ సృష్టించబోతున్నాడు సన్నీ. అదే సమయంలో లాహోర్ 1947 సన్నీ అప్ కమింగ్ లిస్ట్ లో ఉంది షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లేటస్ట్ గా మహారాజ్ ఫేమ్ సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో మాస్ యాక్షన్ థ్రిల్లర్‌కూ రెడీ అవుతున్నారు సన్నీ డియోల్. స్టైలిష్ టేకింగ్, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ లో మార్క్ క్రియేట్ చేసిన సిద్ధార్థ్ పి మల్హోత్రా ఈసారి మాస్ ప్యాకేజీని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ థ్రిల్లర్ డెత్ సెంటెన్స్ నుండి ఇన్‌స్పైర్ అయిన పవర్‌ఫుల్ స్క్రిప్ట్! సుపర్ణ్ వర్మ రాసిన ఈ కథలో యాక్షన్, ఎమోషన్, రివెంజ్ అన్నీ పీక్స్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్ళనుందని బాలీవుడ్ వర్గాల టాక్. లాపటా లేడీస్లో అందరినీ ఆకట్టుకున్న నితాన్షి గోయెల్ ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ కొట్టేసిందన్నన్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. తన కెరీర్ స్టార్ట్ అయిన షార్ట్ పీరియడ్ లోనే సీనియర్ స్టార్ సన్నీ డియోల్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ అందుకోవడం, ఆమెకే కాదు మొత్తం బిటౌన్‌కే షాక్ ఇచ్చే న్యూస్ అయ్యింది.
