Site icon NTV Telugu

Mark Shankar Pawanovich: పవన్ ఫాన్స్ ఊపిరి పీల్చుకోండి.. మార్క్ బాబు సేఫ్..ఇదిగో ప్రూఫ్ !

Mark Shankar

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు పవన్ కళ్యాణ్ సహా చిరంజీవి దంపతులు వెళ్లారు. పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకొని మార్క్‌ను కలిశారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు, ఊపిరితిత్తులకు పొగ చేరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ వైద్యులు, అధికారులతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే మాట్లాడారు.

Mohan Babu: ఎల్బీనగర్ కోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు

మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ చేరడంతో ఆ కారణంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి పరీక్షలు చేస్తున్నామని వారు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే మార్క్‌కు పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అయితే, తాజాగా మార్క్ శంకర్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మార్క్ కాళ్లకు గానీ, చేతులకు గానీ ఇబ్బంది పెట్టే అంత గాయాలు అయితే కనిపించడం లేదు. మోచేతి దగ్గర ఒక కట్టుతో పాటు, ముఖానికి ఆక్సిజన్ సిలిండర్‌తో మార్క్ కనిపిస్తున్నాడు. రెండు చేతులతో థమ్స్-అప్ చూపిస్తూ, తాను బాగానే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

Exit mobile version