NTV Telugu Site icon

Marco OTT: మోస్ట్ వయలెంట్ ఫిలిం ఓటీటీ ఎంట్రీ.. గెట్ రెడీ

Marco Teugu

Marco Teugu

ఈ ఏడాది మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మార్కో సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిస్థాయి బ్లడ్ యాక్షన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ లవర్స్ అయితే ఫుల్ మీల్స్ అన్నట్లుగా ఫీలయ్యారు. మలయాళ ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమాని హనీఫ్ ఆదేని డైరెక్ట్ చేశారు. సాధారణంగా మలయాళ సినిమాలంటే ప్రకృతికి దగ్గరగా, చిన్న చిన్న పాయింట్లతో పెద్దగా సెట్లు, ఫైట్లు, పాటలు అవసరం లేదు అన్నట్టుగా సాగిపోతూ ఉంటాయి.

Raviteja: అబ్బే.. అదంతా ఒట్టిదేనట!

అయితే అందుకు భిన్నంగా బాలీవుడ్, టాలీవుడ్ సహా మాస్ ప్రేక్షకులందరినీ అల్లరించేందుకు అన్నట్టుగా ఈ మార్కో సినిమాని రూపొందించారు. ఈ సినిమాను తెలుగులో కూడా థియేటర్లలో రిలీజ్ చేయగా మంచి సంహాలనం సృష్టించింది. ఇక ఈ మార్కో సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి ఈ మార్కో సినిమా సోనీ లివ్ ప్లాట్ ఫామ్ లో మలయాళ భాషలో మాత్రమే కాదు తెలుగు, తమిళ, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు.