Site icon NTV Telugu

Manchu Manoj: మీడియా ముందు కన్నీటి పర్యంతమైన మనోజ్

Manchu Manoj

Manchu Manoj

మంచు మోహన్ బాబు కుటుంబాల్లో వివాదాలు తెరమీదకు వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న సాయంత్రం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ ఈరోజు డీజీపీ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ని మనోజ్ మౌనిక దంపతులు కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు మహేష్ భగవత్ రూమ్ లోనే మనోజ్ దంపతులు ఉన్నారు. సుమారు 15 నిమిషాల పాటు మహేష్ భగవత్ తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. గత రెండు రోజులుగా తన కుటుంబంలో ఏర్పడిన వివాదం మొత్తాన్ని మనోజ్ దంపతులు మహేష్ భగవత్ కి వివరించారని ఈ సందర్భంగా మనోజ్ తనకు తన భార్య పిల్లలకు రక్షణ కల్పించాలని కోరినట్లుగా తెలుస్తోంది.

Arvind Dharmapuri: మోడీకి ధన్యవాదాలు తెలిపిన బీజేపీ ఎంపీ

అయితే మహేష్ భగవత్ రూమ్ నుంచి మంచు మనోజ్ తీవ్ర ఆవేదనతో బయటకు వచ్చారు మీడియాతో సైతం మాట్లాడలేని పరిస్థితిలో కన్నీళ్ళ పర్యంతమయ్యారు. ఇక ఈ సందర్భంగా మహేష్ భగవత్ మాట్లాడుతూ మనోజ్ ఫిర్యాదును స్వీకరించామని అన్నారు. తమకు ప్రాణహాని ఉందని మనోజ్ దంపతులకు వెల్లడించారని తెలియజేశారు. తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుని కలవాలని మనోజ్ దంపతులకు మహేష్ భగవత్ సూచించినట్లుగా తెలుస్తోంది .

Exit mobile version