NTV Telugu Site icon

Mangampeta: ఊరినిండా రాక్షసులే.. చేయాల్సింది యుద్ధం కాదు.. శివతాండవం

Mangampeta

Mangampeta

“Mangampeta” First Look, Glimpse Unveiled: చంద్రహాస్ కే, అంకిత సాహా కాంబినేషన్‌లో ‘మంగంపేట’ అనే సినిమా తెరకెక్కింది. గౌతం రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను భాస్కర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. శ్రీహరి చెన్నం, రాజేంద్ర పోరంకి సహ నిర్మాతలుగా.. మానస్ చెరుకూరి, ప్రముఖ్ కొలుపోటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా గ్లింప్స్‌ను రీసెంట్‌గా విడుదల చేశారు.

Lavanya : రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి పారిపోయాడు.. శేఖర్ బాషాతో అదే గొడవ!

ఆ గ్లింప్స్ కనుక చూస్తే ‘ఈశ్వర్.. 20 ఏళ్లు అయిందిరా.. ఊరిని చూడాలనిపిస్తుందిరా.. చూపిస్తావా?..’, ‘కొన్ని రోజులు ఆగమ్మా.. ఊరినిండా రాక్షసులే ఉన్నారు.. వాళ్లని చంపి.. ఊరిని చూపిస్తానమ్మా..’, ‘చంపాల్సింది రాక్షసుల్ని కాదు.. రావణుడ్ని..’,‘రాముడు రాలేకపోవచ్చు.. శివుడు శూలాన్ని పంపిస్తే.. చేయాల్సింది యుద్ధం కాదు.. శివతాండవం..’ అంటూ సాగిన డైలాగ్స్.. చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ఆసక్తి రేకెత్తిచేలా ఉన్నాఉ. ఇక మంగంపేట టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్‌‌లో ఉంది. కెమెరామెన్ ఈ మూవీ కోసం వాడిన కలర్ గ్రేడింగ్, పెట్టిన షాట్స్, మ్యూజిక్ ఢైరెక్టర్ ఇచ్చిన ఆర్ఆర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉండగా త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

Show comments