టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ (Manoj Manchu) కేవలం వెండితెరపైనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ తానేంత ‘రాక్‌స్టార్’ అని మరోసారి నిరూపించుకున్నారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే మనోజ్.. తాజాగా ‘మాతృదేవోభవ ఆశ్రమం’ (Matrudevobhava Ashramam) వేదికగా సాటి మనుషుల పట్ల చూపిన మానవత్వం ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటోంది. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న, మానసిక వికలాంగుడైన ఒక అనాథ యువకుడికి మనోజ్ స్వయంగా సెలూన్ కుర్చీలో కూర్చోబెట్టి హెయిర్ కట్ చేసి, సరికొత్త లుక్‌తో ఒక ‘హీరో’లా మార్చిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ తర్వాత ఆ యువకుడిని శుభ్రం చేసి, తన చేతులతో సరికొత్త దుస్తులు (New Clothes) తొడిగారు. ఒకప్పుడు గుర్తుపట్టలేనంత దీన స్థితిలో ఉన్న ఆ యువకుడు, మనోజ్ చేసిన మేకోవర్ తర్వాత ఒక సినిమా హీరోలా మెరిసిపోవడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. ఇందులో భాగంగా మనోజ్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ.. ‘మనం 2026వ సంవత్సరంలో జీవిస్తున్నాం.. ప్రపంచం ఇంత అభివృద్ధి చెంది, అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. తోటి మనుషులు ఇలా రోడ్లపై దిక్కులేకుండా, అనాథలుగా వదిలివేయబడటం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది’ అని మంచు మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు ఈ సందర్భంగా మనోజ్ ఒక కీలక ప్రకటన చేశారు. సమాజంలో మానసిక వైకల్యంతో బాధపడుతూ, బంధువులు వదిలేసి, జీవితంపై ఆశ కోల్పోయిన వారి కోసం త్వరలోనే తన ఆధ్వర్యంలో ఒక భారీ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఆశ్రమంలో సరైన వసతులు లేక కొందరు వృద్ధులు, రోగులు చెట్ల కింద కూర్చుని తింటుండటం చూసి మనోజ్ స్పందించారు. వారికి వెంటనే మంచి మంచాలు (Cots), కుర్చీలు (Chairs) ఏర్పాటు చేస్తానని నిర్వాహకులకు మాట ఇచ్చారు.. మంచు మనోజ్ చూపిన ఈ గొప్ప మనసుకు ఆశ్రమ నిర్వాహకులు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆశ్రమాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, అనాథలకు సేవ చేసిన మొట్టమొదటి సినీ నటుడు మంచు మనోజ్ మాత్రమేనని వారు ఈ సందర్భంగా కొనియాడారు. మనోజ్ చేసిన ఈ ‘రీబర్త్ ఛాలెంజ్’ వీడియోను చూసి నెటిజన్లు, సినీ ప్రముఖులు “రియల్ హీరో మనోజ్.. హ్యాట్సాఫ్” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మాతృదేవోభవ ఆశ్రమంలో ‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’ను స్వీకరించి, మానవత్వం చాటుకున్న మనోజ్ మంచు!
అనాథ, మానసిక స్థితి సరిగ్గా లేని సంతోష్ అనే యువకుడికి స్వయంగా హెయిర్ కట్ చేసి, కొత్త బట్టలు అందించి హీరోలా మార్చేసిన మనోజ్
"మనం 2026లో జీవిస్తున్నాం.. అన్ని వనరులు ఉన్నా ఇలాంటి… pic.twitter.com/oWQ21qynub
— NTV Breaking News (@NTVJustIn) May 27, 2026
