Site icon NTV Telugu

బర్త్ డే రోజు మంచు మనోజ్ ఎవరూ ఊహించని నిర్ణయం…!

Manchu Manoj to Help 25,000 Families on his Birthday Occasion

నేడు యంగ్ హీరో మంచు మనోజ్ బర్త్ డే. పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మంచు మనోజ్ 25,000 కుటుంబాలకు సాయం అందించడానికి ముందడుగు వేశారు.”ఈ సంవత్సరం పుట్టిన రోజున కోవిడ్-19 వల్ల ప్రభావితమైన వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతుగా సహాయం చేయాలి అనుకుంటున్నాను. ముందుగా మన ప్రాణాన్ని కాపాడడానికి వాళ్ల ప్రాణాలని, కుటుంబాన్ని పణంగా పెట్టి మనందరినీ కాపాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్స్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలోనే మాస్కులు ధరించి, తరచూ శానిటైజ్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి. నా వంతుగా ఈ పుట్టిన రోజున నేను, నా అభిమానులు, మిత్రులు కలిసి ఈ కరోనా వల్ల ప్రభావితమైన 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించి నా వంతు సహాయం చేస్తూ, ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నాను. ఈ కష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండి మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం. స్టే హోమ్… స్టే హ్యాపీ… బీ పాజిటివ్ సదా నా ప్రేమతో మీ మంచు మనోజ్” అంటూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశాడు మంచు మనోజ్. ఇక ఈరోజు మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version