Site icon NTV Telugu

Manchu Manoj: పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్.. మళ్ళీ తండ్రిపై ఫిర్యాదు

Manoj Comp

Manoj Comp

మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు తన మీద దాడి చేశాడని మంచు మనోజ్ మంచు మనోజ్ తన మీద దాడి చేశాడని మంచు మోహన్ బాబు ఇద్దరూ డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తర్వాత మంచు ఫ్యామిలీ అది నిజంగాదని మీడియా కథనాలను ఖండించారు. అయితే ఈరోజు ఉదయం నుంచి మోహన్ బాబు జలపల్లి నివాసం వద్ద పెద్ద ఎత్తున బౌన్సర్లను మొహరించడం హాట్ టాపిక్ అవుతోంది. మంచు విష్ణు తరుపున 40 మంది మంచు మనోజ్ తరఫున 30 మంది బౌన్సర్లు ఆ నివాసం దగ్గర మోహరించారు. కొంతమంది లేడీ బౌన్సర్లు సైతం రంగంలోకి దిగడంతో అసలు ఏం జరుగుతుందా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

Fateh Teaser: సోనూ సూద్ ‘ఫతే’ టీజర్ అదిరిందిగా

అయితే కాసేపట్లో మోహన్ బాబు మంచు మనోజ్ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారని దుబాయ్ నుంచి వచ్చిన మనసు విష్ణు కూడా వీరితోపాటు కలిసి మాట్లాడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఒకరకంగా ఫ్యామిలీలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నట్లు ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని మళ్ళీ తేలింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ వెళ్లిన మంచు మనోజ్, మోహన్ బాబు ప్రమేయంతో తనపై దాడి అంశంపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాదు తనపై దాడి చేసిన వారి వివరాలు పోలీసులకు ఇచ్చారు మనోజ్. ఎమ్మెల్సీ రిపోర్ట్ను సైతం పోలీసులకు అందజేశారు మంచు మనోజ్.

Exit mobile version