Site icon NTV Telugu

Manchu Manoj : శివాజీ ‘సామాన్లు’ కామెంట్స్.. మంచు మనోజ్ సంచలన లేఖ

Sivaji Manchu Manoj

Sivaji Manchu Manoj

నిన్న రాత్రి జరిగిన దండోరా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకాలం రేపాయి. హీరోయిన్ల వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడుతూ వారు చీర కట్టుకుని ఈవెంట్లకు హాజరైతే బాగుంటుందని, సామాన్లు దాచుకుంటేనే విలువని వాటిని చూపిస్తే విలువ తగ్గుతుందన్నట్లు అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ఈ విషయం మీద ఇప్పటికే సింగర్ చిన్మయి, అనసూయ వంటి వారు స్పందించారు. అయితే ఆసక్తికరంగా ఈ కామెంట్ల మీద టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సంచలన లేఖ ఒకటి విడుదల చేశారు.

Also Read: BhagyashriBorse : భాగ్యనగరంలో చలి.. సోషల్ మీడియాలో భాగ్యశ్రీ అందాల వేడి

ఈ మేరకు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హీరోయిన్లపై నైతిక బాధ్యతను మోపడం అనేది చాలా పాతకాలపు ఆలోచన అని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మనోజ్ పేర్కొన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం కంటే, వారు తమ ప్రవర్తన పట్ల జవాబుదారీతనంతో ఉండాలని ఆయన సూచించారు. ఇటువంటి వ్యాఖ్యలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15 మరియు 21 కల్పించిన సమానత్వం, గౌరవం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ వంటి హక్కులను ఉల్లంఘిస్తాయని ఆయన గుర్తు చేశారు.

Also Read: NBK : కొరటాల శివ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ

కొందరు సీనియర్ నటులు చేసిన వ్యాఖ్యలు మహిళలను ఒక వస్తువుగా చిత్రీకరించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, వారి తరపున మనోజ్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. అటువంటి మాటలు పురుషులందరి అభిప్రాయం కాదని ఆయన స్పష్టం చేశారు. సమాజంపై ప్రభావం చూపే వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, మహిళలకు ఎల్లప్పుడూ గౌరవం, సమానత్వం దక్కాలని ఆయన ఆకాంక్షించారు. మనోజ్ మంచు చేసిన ప్రకటన పట్ల సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళల హక్కుల కోసం ఒక నటుడిగా ఆయన చూపిన చొరవను అభినందిస్తున్నారు.

Exit mobile version