NTV Telugu Site icon

Manchu Family: మెజిస్ట్రేట్ ముందే తిట్టుకున్న మంచు మనోజ్ & మోహన్ బాబు!

Manchufamily

Manchufamily

మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు రచ్చకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఆస్తి తగాదాలో భాగంగా నటుడు మోహన్ బాబు ఫైల్ చేసిన సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 కింద మంచు మనోజ్ పై నేడు సివిల్ కోర్టు కేసు విచారణ జరిగింది. మధ్యాహ్నం 03.00 గంటలకు కొంగరకలన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరు అయ్యాడు మంచు మనోజ్. గత నెల 18న రంగారెడ్డి జిల్లా అదనపు మెజిస్ట్రేట్ ఎదుట విచారణ హాజరై వివరాలు వెల్లడించారు మంచు మనోజ్. నేడు మరోసారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విచారణ హాజరుకావాలని నోటీసు రావడంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మంచు మోహన్ బాబు కూడా రాగా మంచు మనోజ్ కుమార్ మెజిస్ట్రేట్ వద్దకు డాక్యుమెంట్స్ తో సహా లోనికి వెళ్లారు.

Sonu Sood: సోనూసూద్ ట్రస్ట్ తరపున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు

అయితే మెజిస్ట్రేట్ ఎదుట మంచు మనోజ్ & మోహన్ బాబు పరస్పరం దూషణలకు దిగినట్టు తెలిసింది. కొద్ది సేపటి వరకు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత మంచు మనోజ్ , మొహన్ బాబు విచారణ ముగిసింది. ఆస్తి తగదాకి సంబంధించి ప్రతిమ సింగ్ కు పూర్తి వివరాలు అందజేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వెళ్లిపోయారు మోహన్ బాబు & మంచు మనోజ్. సుమారు రెండు గంటల పాటు సాగిన మెజిస్ట్రేట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా ఆవేశంతో వెళ్లిపోయాడు మంచు మనోజ్. వచ్చే వారం మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట విచారణ హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది.