NTV Telugu Site icon

Manchu Manoj: బయటినుంచి రౌడీలను తీసుకొచ్చారు..వాళ్లకు నేను ఒక్కడిని చాలు!

Manchu

Manchu

మంచు ఫ్యామిలీ వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు ఇంటి దగ్గర జరిగిన రచ్చ పెద్ద చర్చగా మారగా.. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం కాస్త చల్లబడినట్టు కనిపిస్తోన్న సమయంలో.. మంచు మనోజ్‌ తిరుపతి పర్యటన మరోసారి కాకరేపుతోంది..తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్‌ వస్తారన్న సమచారంతో అప్రమత్తమైన పోలీసులు.. శాంతి భద్రతల దృష్ట్యా.. మోహన్‌బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదంటూ మనోజ్‌ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్ లోనే మోహన్ బాబు ఉండగా పోలీసులు మనోజ్ ను అడ్డుకున్నారు. తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను మనోజ్‌ ప్రశ్నించారు. కానీ కోర్టు ఆర్డర్‌ ఉండనై, యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

Manchu Manoj: మొన్న పంది పి**డా.. ఇప్పుడు ఎలుగు బంటి.. ఏందయ్యా మనోజ్?

యూనివర్సిటీ లోపలికి వెళ్లనీయకపోవడంతో నటుడు, మనోజ్ తండ్రి మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవ పడ్డారు. ఇరు వర్గాల బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకుని రాళ్ల దాడులు చేసుకున్నారు. ఇక ఆ తరువాత మీడియాతో మాట్లాడిన మనోజ్ మా తాత నాన్నమ్మ సమాధులకు దండం పెట్టుకుందాం అని యూనివర్సిటీకి వచ్చాను. విద్యార్థుల కోసం ప్రశ్నించినందుకు నన్ను ఇంట్లోకి రానివ్వకుండా చేశారు అని అన్నారు. ఇక మా అమ్మ బ్రెయిన్ వాష్ చేశారు, మేము ఇక్కడికి వస్తున్నాం అని తెలిసి ఢిల్లీ నుంచి బౌన్సర్లను తీసుకొచ్చారని అన్నారు. రోడ్డు మీద పోలీసుల లాఠీలను రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారని అంటూ ఆయన అన్నారు. తాను బరిలోకి దిగితే ఒక్కొక్కడిని తరిమి కొడతానని అన్నారు. అయితే పోలీసుల మీద గౌరవంతోనే వెనక్కి వెళుతున్నానని ఆయన అన్నారు.