NTV Telugu Site icon

Manchu Manoj: మొన్న పంది పి**డా.. ఇప్పుడు ఎలుగు బంటి.. ఏందయ్యా మనోజ్?

Elgugu Banti

Elgugu Banti

తిరుపతిలోని మోహన్‌ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మోహన్‌ బాబు చిన్న కొడుకు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని అడ్డుకోగా తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను మనోజ్‌ ప్రశ్నించారు. కానీ కోర్టు ఆర్డర్‌ ఉండనై, యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లనీయకపోవడంతో నటుడు, మనోజ్ తండ్రి మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవ పడ్డారు. ఇరు వర్గాల బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకుని రాళ్ల దాడులు చేసుకున్నారు.

Sanjjanaa : ఆ కన్నడ హీరో పట్టుకుని పిసికేశాడు.. బుజ్జిగాడు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

దాంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తాత, నానమ్మ సమాధుల వద్దకు వెళ్లొద్దని కోర్టు ఆర్డర్‌లో లేదని, తాను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా అని పోలీసులతో చెప్పిన మనోజ్ ఉద్రిక్తతల మధ్య వర్సిటీ మూడో గేటు నుంచి లోపలి వెళ్లారు. ఇక మంచు మనోజ్ ని లోపలికి అనుమతించక పోగా మనోజ్ ఈ సందర్భంగా ‘ఒరేయ్ ఎలుగుబంటు.. ఎవడ్రా నువ్వు? గేట్ తీయ్. ఎందుకురా భయపడుతున్నారు’ అంటూ చేసిన కామెంట్ల వీడియో వైరలవుతోంది. కాగా హైదరాబాద్ జల్ పల్లి నివాసం వద్ద ఆయన ‘ఎవడ్రా పంది *****’ అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ రోజు మనోజ్‌ కుటుంబ సమేతంగా హైదరాబాద్‌ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో మోహన్‌ బాబు యూనివర్సిటీకి ర్యాలీతో చేరుకున్నారు.

Show comments