NTV Telugu Site icon

Manchu Manoj: రాచకొండ సిపి ముందు మంచు మనోజ్ బైండోవర్!

Mohanbabu

Mohanbabu

నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమోదైన కేసుల విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మెజిస్ట్రేట్ హోదాలో నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి స్పందిస్తూ మంచు మనోజ్ నిన్న నేరేడ్ మెట్ లోని పోలీస్ కమిషనరేట్ లో సుధీర్ బాబు ఐపీఎస్ ముందు హాజరయ్యారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన గొడవకు సంబంధించిన విషయాలలో మంచు మనోజ్ వాంగ్మూలం తీసుకున్నారు. కుటుంబ వివాదాలు శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వారి కుటుంబ వివాదాల నేపథ్యంలో వారి చర్యలు సమాజంలోని ఇతర వ్యక్తులకు, ఆ చుట్టుపక్కల ప్రజల శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నట్లయితే చర్య తీసుకోవడం జరుగుతుందని మరోసారి గొడవలు జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించి సంయమనం పాటించాలని సూచించారు.

Manchu Vishnu: మంచు విష్ణుకు పోలీసులు వార్నింగ్?

కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఒక సంవత్సరం కాలం పాటు శాంతి కాపాడడానికి ఎలాంటి ప్రతికూల చర్యలకు దిగకుండా ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ఉంటానని బాండ్ ఇవ్వడం జరిగింది. ఇదే రోజు సాయంత్రం మోహన్ బాబు పెద్ద కుమారుడు అయిన మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజరయ్యారు అనంతరం కమిషనర్ గారికి తన తరఫు వాదనలు వినిపించి తనకు కోర్టు 24వ తేదీ వరకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల గురించి తెలియజేశారు. ఈ వివాదంలో అక్కడ ఎలాంటి సమస్యలు సృష్టించవద్దు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదు అని కమిషనర్ తెలియజేసి, తర్వాత కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యల గురించి తెలియజేయడం జరుగుతుందని అప్పటివరకు శాంతి భద్రత ఎలాంటి విఘాతం కలిగించినా వారి మీద తగిన చర్యలు ఉంటాయని ఆదేశించారు.

Show comments