Site icon NTV Telugu

Manchu Manoj: గొడవలకు బ్రేక్‌.. షూటింగ్‌కి మనోజ్‌

Manchu Manoj As Gajapathi

Manchu Manoj As Gajapathi

ఫ్యామిలీ గొడవలతో గత రెండు మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్న మంచు మనోజ్ వాటికి ఎట్టకేలకు బ్రేక్‌ ఇచ్చాడు. ఈరోజు షూటింగ్‌ సెట్‌కి వెళ్ళాడు మంచు మనోజ్ మనోజ్‌.. ప్రస్తుతం భైరవం సినిమాలో నటిస్తున్నాడు మంచు మనోజ్‌.. తన వెంట ఉన్న వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లను నిన్న సాయంత్రమే ఇంటికి పంపేశాడు మనోజ్. ఇక ఈరోజు మంచు మోహన్ బాబు ప్రెస్ ముందుకు రానున్నారు. ఆయన మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక భైరవం సినిమా విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భైరవం’.

Pushpa 2 The Rule : పార్టీ ఉంది పుష్ప.. టీం సక్సెస్ పార్టీ అదిరింది!

విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, సంగీతం శ్రీ చరణ్ పాకాల. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.

Exit mobile version