NTV Telugu Site icon

Manchu Controversy : మీడియాకి క్షమాపణలు తెలిపిన మోహన్ బాబు

Manchufamily

Manchufamily

సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసిన నేపధ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసియాన్ ఘటనలో మోహన్ బాబు పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో సదురు జర్నలిస్ట్ కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ విషయమై ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేస్తూ ‘ ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడానికి మరియు జరిగిన సంఘటనల పట్ల నా ప్రగాఢ విచారం వ్యక్తం చేయడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను. వ్యక్తిగత కుటుంబ వివాదంగా ప్రారంభమైన సంఘటన పెద్ద పరిస్థితికి దారితీసింది, ఇది గౌరవనీయమైన జర్నలిస్టు సోదరులకు కూడా బాధ కలిగించడం నాకు చాలా బాధ కలిగించింది. నేను గత 48 గంటలుగా ఆసుపత్రిలో ఉన్నాను అందుకే వెంటనే స్పందించలేకపోయారు.

Also Read : VishwakSen : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మెకానిక్ రాకీ.. ఎక్కడంటే..?

దాదాపు 30-50 మంది వ్యక్తులు, సంఘ వ్యతిరేక వ్యక్తులు, హాని చేయాలనే ఉద్దేశ్యంతో నా ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. అక్కడ ఉన్నవారు, నేను ప్రశాంతతను కోల్పోయాను. ఈ గందరగోళం మధ్య, మీడియా అనుకోకుండా పరిస్థితిలో చిక్కుకుంది. నేను పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా, మీ జర్నలిస్టులలో ఒకరైన రంజిత్‌కు దురదృష్టవశాత్తూ గాయమైంది. ఇది చాలా విచారించదగ్గ పరిణామం మరియు అతనికి, అతని కుటుంబానికి బాధ మరియు అసౌకర్యానికి నేను తీవ్రంగా చింతిస్తున్నాను. రంజిత్ మరియు మొత్తం జర్నలిస్ట్ కుటుంబానికి, బాధ కలిగించిన నా చర్యలకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మరియు నేను త్వరగా కోలుకోవాలని ప్రార్దించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు  భవదీయులు, మోహన్ బాబు’ అని లేఖ విడుదల చేసారు.

Show comments