NTV Telugu Site icon

మనసా వినవా’ లిరికల్ సాంగ్ లాంచ్ చేసిన రాశి ఖన్నా

Manasa Vinava Lyrical from 101 Jillala Andagadu launched by Raashi Khanna

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. తాజాగా ‘101 జిల్లాల అందగాడు’నుంచి ‘మనసా వినవా’ మెలోడీ లిరికల్ వీడియో సాంగ్ ను హీరోయిన్ రాశి ఖన్నా విడుదల చేసింది. శ్రీరామ్ చంద్ర, ధన్య బాలకృష్ణ ఈ సాంగ్ ను ఆలపించగా… భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందించారు. హీరోహీరోయిన్ల మధ్య సాగుతున్న ‘మనసా వినవా’ హార్ట్ ఫుల్ మెలోడీ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

కాగా ‘101 జిల్లాల అందగాడు’లో ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ కథను అందించారు. దిల్ రాజు – క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్, వై.రాజీవ్ రెడ్డి , సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం మే 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nootokka Jillala Andagadu Songs | Manasa Vinava Song Lyrical | Avasarala Srinivas | Ruhani Sharma