NTV Telugu Site icon

Manas: పెళ్ళైన ఏడాది లోపే గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ మానస్

Manas Nagulapalli To Become Father Soon

Manas Nagulapalli To Become Father Soon

Manas Nagulapalli to become father soon: సీరియల్ యాక్టర్ మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఒక పక్క సీరియల్, షోస్ చేస్తూనే ఇంకోపక్క మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక బిగ్ బాస్ లో కూడా మానస్ పాల్గొని మంచి ఆటతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక గత ఏడాది చివరిలో మానస్ ఒక వ్యాపారవేత్త కుమార్తె శ్రీజ నిశ్శంకర్‌ రావుని అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.

Guruvayur Ambalanadayil Set Fire: సూపర్ హిట్ సినిమా సెట్లో మంటల కలకలం!

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా కూడా మారాయి. ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్నాడు. తెలుగులో అత్యధిక టీఆర్పీ రాబడుతున్న సీరియల్ గా బ్రహ్మముడి ఉంది. కార్తీక దీపం 2కి మించే బ్రహ్మముడి సీరియల్ కి ఆదరణ దక్కుతుంది. ఇక పెళ్ళై ఏడాది గడవక ముందే గుడ్ న్యూస్ చెప్పాడు మానస్. తన భార్య గర్భం దాల్చిన విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మానస్. త్వరలో బేబీ నాగులపల్లి వస్తుందని వెల్లడించాడు. మానస్ తండ్రి అవబోతున్నాడు అనే విషయం తెలిసిన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక 22 జూన్ న ఆమె సీమంతం కూడా ఘనంగా జరిగింది.

Show comments