Site icon NTV Telugu

ఆకాశవాణి : ‘మన కోన’ లిరికల్ వీడియో సాంగ్

Mana Kona Lyrical Song from Aakashavaani is Out Now

విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ఆకాశవాణి’. దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి ‘ఆకాశవాణి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు ఎడిటర్‏గా జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు. ప్రముఖ మాటల ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు సింగర్ కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘మన కోన’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ను మంగ్లీ, కాల భైరవ ఆలపించగా… అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Exit mobile version