అనుపమ్ ఖేర్… ఎంతో టాలెంట్ ఉన్న సీనియర్ బాలీవుడ్ నటుడు. ఒకటి, రెండు కాదు 500 కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. దేశ వ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ ఉంటారు. ఇన్ ఫ్యాక్ట్, హాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించిన అనుపమ్ కి అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉంది. ఇదంతా ఓకే… ఆయన స్వంత రాష్ట్రంలో పరిస్థితి ఏంటి?
అనుపమ్ ఖేర్ హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో పుట్టాడు. అయితే, ఆయన ముంబైకి వచ్చి పెద్ద నటుడిగా ఎదిగాడు. కానీ, ఈ వెటరన్ కి హిమాచల్ లోనే అనూహ్యమైన అనుభవం ఎదురైంది. దాని తాలూకూ వీడియోని కూడా అనుపమ్ ఖేర్ సరదాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆయన కొండల నడుమన చల్లటి, చక్కటి హిమాచల్ వాతావరణంలో మార్నింగ్ జాగింగ్ చేస్తున్నాడు. ఇంతలో అక్కడి స్థానికుడు ఒకాయన ఎదురయ్యాడు. ముఖానికి మాస్క్ తో ఉన్న అనుపమ్ తనని గుర్తించావా అని అడిగాడు! అతను లేదన్నాడు. మాస్క్ తీసేసి మరీ ‘ఇప్పుడు?’ అని ప్రశ్నించాడు! అయినా నో యూజ్!
Read Also : అట్లీ సినిమాలో… బాలీవుడ్ ‘రాజా’, కోలీవుడ్ ‘రాణి’!
అనుపమ్ ఖేర్ ని గుర్తించని హిమాచల్ స్థానికుడి పేరు జ్ఞాన్ చంద్. అతను ఎందుకోగానీ అనుపమ్ ఖేర్ ని పెద్దగా గుర్తించలేకపోయాడు! ఈ విషయాన్ని నెటిజన్స్ కు చెబుతూ, అనుపమ్ ఖేర్… ‘’నేను ఎప్పుడూ 518 చిత్రాల్లో నటించాను అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. నన్ను ఇండియాలో అందరూ గుర్తిస్తారనే ఇంత కాలం భావించాను! కానీ, జ్ఞాన్ చంద్ చాలా అమాయకంగా నా విశ్వాసాన్ని బద్ధలుకొట్టేశాడు! ఆయనకి నేనెవరో కొంచెం కూడా తెలియదు. ఆ విషయం నన్ను కాస్త బాధించింది. అయితే, ఈ అనుభవం కూడా ఎంతో మంచిదే! కారణం… నన్ను గుర్తించని జ్ఞాన్ చంద్ నా కాళ్లు భూమ్మీదే ఉండేలా పాఠం నేర్పించాడు… ‘’ అన్నాడు!
