‘ప్రేమలు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు భాషల్లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా చాటింది. మూడు చిత్రాల్లో రెండు సూపర్ హిట్ కాగా, ఒకటి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇటీవల తమిళంలో వచ్చిన ‘జన నాయగన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ, మమిత నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో అల్లరిపిల్లగా సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక మలయాళంలో నివిన్ పౌలీతో కలసి నటించిన ‘బెత్లెహేమ్ కుడుంబ యూనిట్’ చిత్రం ఏకంగా రూ. 174 కోట్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ పేరుతో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుస విజయాలు వరుస విడుదలలతో మంచి ఫామ్‌లో ఉన్న మమిత బైజు తన డిమాండ్‌కు తగ్గట్టుగా పారితోషికాన్ని భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిర్మాతలు కూడా ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా ఈ స్థాయి పారితోషికం ఇచ్చేందుకు వెనుకాడటం లేదని సమాచారం. ప్రేమలుతో స్టార్ట్ అయిన మమిత హావ రాబోయే రోజుల్లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

