Site icon NTV Telugu

Mamitha Baiju: సినిమా నా జీవితాన్ని మార్చేసింది – మమిత బైజు ఎమోషనల్‌ రివీల్‌

Mamitha Baiju

Mamitha Baiju

సినిమా ప్రపంచం ఎవ్వరి కెరీర్ ను ఎలా మలుపులు తిప్పుతుందో ఎవరికీ తెలీదు. కొంతమందికి అది కేవలం వృత్తి కాదు, జీవితాన్ని మార్చేసే అనుభవం అవుతుంది. అలాంటి అదృష్టం పొందిన వారిలో ఒకరు మలయాళ భామ మమిత బైజు. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు యువతను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల ‘డ్యూడ్‌’ సినిమాలోనూ తన నటనతో మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవిత ప్రయాణం గురించి మమతగా చెప్పుకొచ్చింది – తన తండ్రిలా డాక్టర్ కావాలనుకున్న మమిత, ఇప్పుడు మాత్రం సినిమాలే తన ప్రాణమని చెబుతోంది.

“మా నాన్న డాక్టర్‌. నేను చిన్నప్పుడు ఆయన క్లినిక్‌కి వెళ్తే, అందరూ నన్ను ‘బేబీ డాక్టర్‌’ అని పిలిచేవారు. రోగులు కృతజ్ఞతతో ఆయనకు ధన్యవాదాలు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించేది. అప్పుడే నేను కూడా డాక్టర్‌ కావాలని అనుకున్నా. కానీ నా జీవితం వేరే దారిలో నడిచింది. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు ‘సర్వోపరి బాలక్కారన్‌’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా మా నాన్న స్నేహితుడే నిర్మించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఆడిషన్‌కి వెళ్లాను. అదే నా జీవితానికి మలుపైంది. సినిమా నాకు కేవలం కెరీర్‌ కాదు, ఒక భావోద్వేగం. నేను ఇప్పుడు చేస్తున్న ప్రతి పాత్రలో కొత్తగా నేర్చుకుంటున్నాను. నటన పట్ల నాలో పుట్టిన ప్రేమే నాకు ఈ స్థాయికి తీసుకు వచ్చింది. ఈ ప్రయాణం ఇంకా చాలా దూరం తీసుకెళ్తుంది” అని ఆశిస్తున్న అంటూ చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మమిత వరుస సినిమాలతో బిజీగా ఉంది. తన స్వచ్ఛమైన అభినయం, సహజమైన అందం, పాజిటివ్ ఎనర్జీ తో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదిస్తోంది. నిజంగానే, ఆమె చెప్పినట్టు – సినిమా ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది!

Exit mobile version