Malvi Malhotra Clarity about Video with Raj Tarun : తిరగబడరా సామి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వివాదాస్పద హీరోయిన్గా పేరు తెచ్చుకున్న మాల్వి మల్హోత్రా ఎన్ టీవీ తో ప్రత్యేకంగా సంభాషించింది. ఈ సందర్భంగా ఆమెకు ఈ వివాదం గురించి పలు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్తో సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తున్న ఒక వీడియోలో బూతులు కూడా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. దాని గురించి మీరేమంటారు అని అడిగితే అందులో తప్పేముంది అని ఆమె ప్రశ్నించింది. రాజ్ తరుణ్ మామూలుగానే అందరితో సరదాగా ఉంటాడని ఒక్కోసారి బూతు మాటలు మాట్లాడి కూడా కామెడీ పుట్టించే ప్రయత్నం చేస్తాడని చెప్పుకొచ్చింది. నిజానికి ఆ వీడియో షూట్ చేసింది షూటింగ్ లోకేషన్ లోనే అని అప్పుడు మిగతా వాళ్ళు కూడా దగ్గర్లోనే ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది.
Viraaji Movie Review: వరుణ్ సందేశ్ ‘విరాజి’ రివ్యూ
నిజానికి తాను చెప్పాల్సిన విషయాలన్నీ పోలీసులకు చెప్పానని తన దగ్గర ఉన్న ఆధారాలు సైతం సమర్పించానని మాల్వి మల్హోత్రా చెబుతోంది లావణ్య కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నానని తనను 2020లో అటాక్ చేసిన వాళ్ళతో లావణ్య మాట్లాడిన విషయం కూడా తనకు తెలిసిందని ఆమె చెప్పుకొచ్చింది. లావణ్య క్రిమినల్స్ తో మాట్లాడుతోంది కాబట్టి తనకు ఆమె క్రిమినల్ కిందే లెక్క అంటూ తాజా ప్రెస్ మీట్ లో కూడా మాల్వి మల్హోత్రా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మాణంలో తిరగబడరా సామీ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో ఆగస్టు రెండో తేదీ అంటే ఈరోజు రిలీజ్ అయింది.