NTV Telugu Site icon

Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!

Malvi Malhotra News

Malvi Malhotra News

Malvi Malhotra Clarifies Relation with Raj Tarun: రాజ్ తరుణ్ తో ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్ మాల్వి మల్హోత్రా అన్నారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆమె రాజ్ తరుణ్ నా సహచర నటుడు మాత్రమే అని ఆమె అన్నారు. నేను లావణ్యని బెదిరించలేదు అని ఆమె అన్నారు. లావణ్యతో కూడా నాకు అసలు పరిచయం లేదని మాల్వి అన్నారు. అలాగే లావణ్య నాకు కాల్ చేసి వేధిస్తోంది, బెదిరిస్తోంది అని ఆమె అన్నారు. రాజ్ తరుణ్ తో నటించిన ప్రతి హీరోయిన్ ను ఆమె అనుమానిస్తోంది అని ఈ క్రమంలో ఆమె పేర్కొంది. నామీద ఆమె అసత్య ప్రచారాలు చేస్తోందని ఆమె పేర్కొంది. ఆమె మీద తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా పేర్కొన్నారు. సినిమా షూటింగ్ అయిపోయి ఆరు నెలలు అయిందని అప్పటి నుంచి రాజ్ తరుణ్ తో టచ్ లో కూడా లేనని ఆమె అన్నారు. నాకు రాజ్ తరుణ్ కి సినిమా వల్లే సంబంధం ఉంది.

Tollywood: టాలీవుడ్లో విషాదం.. లేడీ యువ నిర్మాత ఆత్మహత్య.. పురుగులు పట్టేసిన స్థితిలో శవం?

అతను నా సహచర నటుడు మాత్రమే. మేము కలిస్తే సినిమా గురించి మాత్రమే మాట్లాడతాము, అంతకు మించి ఎలాంటి సంబంధం లేదు. నాకు ఆమె ఎవరో తెలియదు, ఆమెను నేరుగా ఎప్పుడూ కలిసింది కూడా లేదు. ఆమె నా గురించి నా కుటుంబం గురించి నా సోదరుడు గురించి చేసినవి అన్నీ తప్పుడు ఆరోపణలు. ఆమె మీద నేను లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాను. నాకు సినిమా షూటింగ్ ముగిసే సమయంలోనే కాల్ చేసి రాజ్ తరుణ్ కు దూరంగా ఉండమని బెదిరించింది. అప్పటి నుంచి ఆరు నెలలుగా నేను రాజ్ తరుణ్ తో మాట్లాడలేదు. నేను ప్రమోషన్స్ మొదలయ్యాక మాట్లాడితే ఇలా చేసింది.

నాకు నా కుటుంబానికి ఆమె మెంటల్ గా హెరాస్ చేసింది. నేను ఈ విషయం మీద మాట్లాడక పోవడానికి నా రెప్యుటేషన్ దెబ్బతింటుందని భయపడ్డాను. అయితే ఇలా చేశాక నేను కూడా కంప్లైంట్ ఇస్తానని అన్నారు. అలాగే నేను ఆమె హెరాస్మెంట్ ఎక్కువైందని రాజ్ తరుణ్ కి చెబితే బ్లాక్ చేయమన్నాడు. నేను బ్లాక్ చేస్తే నా అమ్మానాన్నకి కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టింది. నేను రాజ్ తరుణ్ కి నా పేరెంట్స్ నెంబర్ ఇవ్వలేదు అలాంటిది ఆమె ఎలా వాళ్ళ నంబర్స్ సంపాదించిందో నాకు తెలియాలి అని అన్నారు. ఆమె నాకు కాల్ చేసి రాజ్ తో మాట్లాడద్దు అన్నది నేను సరే మాట్లాడను అని అన్నాను. అయితే నాకు ఆమెతో కానీ, రాజ్ తరుణ్ తో కానీ ఎలాంటి సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు.

Show comments