విమర్శకుల ప్రశంసలు పొందిన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్ రాచకొండకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు ప్రేక్షకులకు “మల్లేశం” వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన రాజ్ రాచకొండ మలయాళంలో “పాకా – ది రివర్ ఆఫ్ బ్లడ్” పేరుతో మరో ఆసక్తికరమైన సినిమాను రూపొందించారు. నితిన్ లుకోస్ (మల్లేశం మూవీ సౌండ్ డిజైనర్) “పాకా”కు దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్, రాజ్ రాచకొండ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “పాకా” సినిమా కథ విషయానికొస్తే… రెండు వైరుధ్య కుటుంబాల రక్తంతో పారే ఒక నది, ప్రేమతో ఈ ద్వేషాన్ని అధిగమించడానికి ప్రయత్నించే ఒక యువ జంటకే సంబంధించినది. ఉత్తర కేరళలోని వయనాడ్‌లో నిర్మించిన ఈ చిత్రంలో బాసిల్ పాలోస్, వినితా కోషి, జోస్ కిజక్కన్, అతుల్ జాన్, నితిన్ జార్జ్, జోసెఫ్ మణికల్ తదితరులు నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9 నుండి 18 వరకు జరగబోయే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఫ్ఎఫ్) 46వ ఎడిషన్‌లో వరల్డ్ ప్రీమియర్ కానుంది.
Read Also : పెళ్లి వేదికపై వధువుతో పాటు… ప్రియురాలు…చివరకు…