NTV Telugu Site icon

ప్రముఖ మలయాళ నటుడు పిసి జార్జ్ మృతి

Malayalam Actor PC George Dies at 74

ప్రముఖ మలయాళ నటుడు పిసి జార్జ్ శుక్రవారం ఉదయం మరణించారు. 74 ఏళ్ల నటుడు కేరళలోని త్రిశూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గతకొంతకాలంగా జార్జ్ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం కొచ్చి సమీపంలోని కరుకుట్టిలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో జరుగుతాయి. ఆయన మలయాళం సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలను పోషించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పోలీసు నుంచి మారిన నటుడు పిసి జార్జ్ 1976 లో ‘అంబా అంబికా అంబాలికా’ చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేశారు. అతను తన కెరీర్లో 75కి పైగా చిత్రాలలో నటించారు. అధర్వం, చాణక్యన్, ఇన్నాలే, పెరువన్నపురతే విశాంగల్, మరియు సంఘం వంటి చిత్రాలలో నటించారు జార్జ్. కొన్ని రోజులక్రితం జార్జ్ పోలీసు సూపరింటెండెంట్ హోదా నుండి రిటైర్ అయ్యారు. పిసి జార్జ్ రెండు వృత్తులనూ బాలన్స్ చేసేవారు.