NTV Telugu Site icon

కూతురితో మహేష్… లవ్లీ పిక్ షేర్ చేసిన నమ్రత

Mahesh spending some lovely time with daughter Sitara

సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్డౌన్ సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా మహేష్ కు తన గారాలపట్టి సితార అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మహేష్ సతీమణి నమ్రత తండ్రీకూతుళ్ళకు సంబంధించిన ఓ లవ్లీ పిక్ ను షేర్ చేశారు. ఆ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ మోనోక్రోమ్ ఫోటోలో మహేష్ బాబు సీతారాను గట్టిగా కౌగిలించుకోవడం చూడవచ్చు. తన పిల్లల కోసం స్కూల్ తిరిగి ఓపెన్ కావడానికి ముందే వారు పొందగలిగేది ఇదేనంటూ నమ్రత ఈ పిక్ ను షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రతా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన కుటుంబ సభ్యుల ఫోటోలు, వీడియోలతో సూపర్ స్టార్ అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుంది.

Image