Site icon NTV Telugu

గెట్ వెల్ సూన్ బ్రదర్… ఎన్టీఆర్ కు మహేష్ ట్వీట్

Mahesh Babu Wishes NTR a Speedy Recovery

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడంతో ఆయన అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. “గెట్ వెల్ సూన్ బ్రదర్… స్ట్రెంత్ అండ్ ప్రేయర్స్” అని ట్వీట్ చేశాడు మహేష్ బాబు. ‘జాగ్రత్తగా ఉండండి. త్వరగా కోలుకోండి’ అంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, “మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి” అంటూ నారా లోకేష్, నారా బ్రాహ్మణి… ఎన్టీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. డాక్టర్ల సలహా మేరకు అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో తనను సంప్రదించిన వారు కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేశారు. 

Exit mobile version