‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా విడుదల కాగానే సుధాకొంగర హాట్ టాపిక్ అయ్యారు. అప్పట్లో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు షికార్లు చేశాయి. వాటిలో మహేశ్ బాబుతో సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ను కొన్నాళ్ళ పాటు ఆపేశారు. ఈ సినిమా తర్వాత మహేశ్ త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా ప్లాన్ చేయబోతున్నాడు. ఇక వచ్చే ఏడాది రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్ రావిపూడితోనూ సినిమా ఉంటుందనే న్యూస్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా త్రివిక్రమ్ సినిమా తర్వాత సుధాకొంగర సినిమా ఉంటుందంటున్నారు. ఇప్పటికే సుధా కొంగర మహేశ్ ఇమేజ్ కి సరిపోయే కథను సిద్ధం చేశారట. మరి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూద్దాం.
మహేశ్ తో సుధాకొంగర సినిమా!?
