Site icon NTV Telugu

SSMB 29: జక్కన్న సినిమాలో మహేష్ పేరు లీక్!?

Ssmb

Ssmb

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు కాబట్టి ఎస్ ఎస్ ఎం బి 29 అని సంభోదిస్తున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు జరిగింది. అసలు సినిమా సెట్స్ నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా రాజమౌళి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ప్రస్తుతానికి ఈ ఇండోర్ షూటింగ్ పూర్తయి సినిమా యూనిట్ అంతా అవుట్డోర్ షూటింగ్ కోసం ఒడిస్సాలోని ఈస్ట్రన్ ఘాట్స్ కు వెళ్ళింది.

Women’s Day-2025: వనిత టీవీ ‘ఉమెన్స్ డే’ స్పెషల్ సాంగ్ రిలీజ్..

కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్ అక్కడే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇండియానా జోన్స్ తరహాలో సాగే ఈ కథలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ పేరు ఇదే అంటూ రుద్రా అనే పేరు వైరల్ అవుతోంది. రాజమౌళి సినిమా గురించి ఎన్నో కండిషన్స్ పెట్టాడు కాబట్టి లీకైన ఈ పేరు నిజం అని చెప్పలేం. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. సినిమా షూటింగ్ సహా సినిమా అప్డేట్స్ కూడా బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న రాజమౌళి దానికి తగ్గట్టు అగ్రిమెంట్స్ కూడా చేయించాడు.

Exit mobile version