Site icon NTV Telugu

SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో?

Ssmb 29

Ssmb 29

మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్ ఇప్పటివరకు ఫిక్స్ చేయలేదు. కాబట్టి, ప్రస్తుతానికి దీనిని ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29 అనే పేరుతో సంబోదిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read:Nagarjuna: కొడుకు పెళ్లి హడావుడిలోనూ సినిమా కోసమే నాగ్ తపన!

ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళంలో స్టార్ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన మాధవన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్‌లు పూర్తయి, త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఆయన త్వరలోనే సెట్స్‌లో కూడా అడుగు పెట్టబోతున్నారు.

Also Read:Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఇంటర్నల్ కమిటీ!

ఈ సినిమా కేవలం భారతదేశంలోనే కాక, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో షూట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే లొకేషన్స్ ఫైనల్ అయ్యాయి. ఇది మొట్టమొదటి ఇండియన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దాన్ని బట్టి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version