Mahesh Babu : ‘డీసీ’ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్.. ఒరిజినల్ అండ్ అవుట్‌స్టాండింగ్

Mahesh Babu Tweet Abou Dc

Mahesh Babu Tweet Abou Dc

లోకేష్ కనకరాజ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా డీసీ. ఆగస్టు 7న రిలీజైన డీసీ సరికొత్త రస్టిక్, ఒరిజినల్ అండ్ మైండ్ బ్లోయింగ్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. రొటీన్ కథాంశాలకు భిన్నంగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.  దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా సూపర్ పర్ఫామెన్స్ తో, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మేకింగ్ శైలికి అనిరుధ్ మ్యూజిక్ తోడై ఈ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. 

ఇటీవల విడుదలైన ‘డీసీ’ చిత్రంపై సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుప్రశంసల వర్షం కురిపించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై మహేష్ స్పందిస్తూ.. “డీసీ… ఒరిజినల్ మరియు అవుట్‌స్టాండింగ్ సినిమా. సినిమా చాలా కూల్‌గా అనిపించింది, ప్రతీ సీన్‌నూ ఎంతగానో ఆస్వాదించాను. చిత్ర యూనిట్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు” అని ఎక్స్ వేదికగా కొనియాడారు. మహేశ్ బాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక స్టార్ హీరో నుంచి వచ్చిన ఈ ప్రశంస ‘డీసీ’ చిత్ర బృందానికి పెద్ద బూస్ట్‌లా మారింది. మహేశ్ బాబు ట్వీట్ కు రిప్లై ఇస్తూ మీ ట్వీట్ కు ధన్యవాదాలు సార్ అని చెప్తూ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కామెంట్ చేసారు.