NTV Telugu Site icon

ఫ్యాన్స్ కోసం అన్నీ అనుకున్నట్టుగా జరగాలంటున్న మహేష్ ?

Mahesh Babu Plans to Release Two Movies with Six Months Gap

2020 ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో అభిమానులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన తదుపరి చిత్రాన్ని 2022 సంక్రాంతికే విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు మేకర్స్. అయితే కరోనా మహమ్మారి కారణంగా మహేష్ చేసుకున్న ప్లాన్స్ అన్ని మారిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో మహేష్ నెక్స్ట్ మూవీ కోసం మరింత ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటివరకు 40 శాతం పూర్తయింది. మిగిలింది ఈ ఏడాది అక్టోబర్ వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసిన తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో # SSMB28 చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ఆ తరువాత ఎస్.ఎస్.రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో ఓ భారీ రూపొందనుంది. అయితే అసలు విషయం ఏమిటంటే… 2022లో అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడట మన సూపర్ స్టార్. ఆరు నెలల గ్యాప్‌లో అంటే జనవరిలో “సర్కారు వారి పాట”, 2022 సమ్మర్ లో # ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28 లను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఇక రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ 2022 మొదట్లో ప్రారంభం కానుంది.