NTV Telugu Site icon

సర్కారు వారి పాట : ఫుల్ యాక్షన్ మోడ్ లో మహేష్ బాబు

Mahesh Babu in action mode for Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ తాజాగా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్స్‌లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో ఏప్రిల్ చివరి వరకు యాక్షన్ ఎపిసోడ్, టాకీ పార్ట్ భాగం చిత్రీకరించబడుతుంది. మహేష్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం ఇందులో పాల్గొంటున్నారు. తరువాత ‘సర్కారు వారి పాట’ టీం చిన్న విరామం తీసుకుని మేజర్ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నారు. మరోవైపు మహేష్ బాబు, తివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది. త్వరలో ప్రారంభం కానున్న త్రివిక్రమ్ మూవీ, సర్కారు వారి పాట… రెండు సినిమాల షూటింగ్ లలో మహేష్ ఒకేసారి పాల్గొనే అవకాశం ఉంది. నెల రోజుల్లో మహేష్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో సినిమా రానుందనే వార్తలు విన్పించాయి. కానీ ఎలాంటి క్లారిటీ లేదు.