Happy Birthday Mahesh Babu: మహేశ్ బాబు పేరు వినగానే మన కళ్ల ముందుకు వచ్చే చిత్రం రాజకుమారుడు. అయితే, ఈ రోజు తన గోల్డెన్ జూబ్లీ (50 ఏళ్లు) పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక, ఈ నెంబర్ కేవలం ఒక సంఖ్య మాత్రమే.. వయసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు, ఇప్పటికీ తన గ్లామర్‌తో అమ్మాయిల మనసు దోచేసుకున్నాడు. మహేశ్ బాబుకు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు.
Read Also: HBD Mahesh Babu: ఏంటి భయ్యా నిజమేనా.. మన సూపర్ స్టార్ మహేష్ కు 50 ఏళ్లా?
తన అందం, ఆకర్షణలో ఏ మాత్రం వెన్నె తగ్గని మహేశ్ బాబు, ఇప్పటికీ టీనేజర్‌లా కనిపిస్తుంటాడు. అంతేకాదండోయే, తన కొడుకుకే సోదరుడిలా కనిపించేంత యంగ్ లుక్‌ను మెయింటైన్ చేస్తున్నాడు. టాలీవుడ్‌లో అత్యంత హ్యాండ్సమ్ హీరో ఎవరు? అనే క్వశ్చన్ గానీ వస్తే.. అందరికి కంటే ముందు వినిపించే పేరు మహేశ్ బాబుదే. ఇక, ఆయన కేవలం రూపంతోనే కాదు, తన వ్యక్తిత్వంతో కూడా అందరి మనసును దోచుకున్నాడు. తన నటనలో నైపుణ్యం, మంచి వ్యక్తిత్వం, అందరితో వినయంగా నడుచుకోవడం మహేశ్ బాబును ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే ఆతడ్ని “సూపర్‌స్టార్” అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు.
Read Also: Trump-Netanyahu: ఫోన్‌లో ట్రంప్-నెతన్యాహు మధ్య వాగ్యుద్ధం.. ట్రంప్ అరిచినట్లుగా ప్రచారం!
కాగా, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాల్లో నటించలేదు అంటే నమ్మశక్యం కాని విషయం. కానీ, ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగులోనే రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ, టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మహేశ్ బాబు రికార్డులు చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కొన్ని ప్రాంతీయ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ కలెక్షన్లతో సమానంగా నిలిచాయి. సరిలేరు నీకెవ్వరు – రూ.260 కోట్లు, సర్కారు వారి పాట – రూ. 214 కోట్లు, గుంటూరు కారం – రూ. 200 కోట్లు, భరత్ అనే నేను – రూ. 187 కోట్లు, మహర్షి – రూ. 170 కోట్లను ఒక్క భాషలోనే వసూళ్లు సాధించిన ఘనత ఈ ప్రిన్స్ మహేశ్ బాబుకే దక్కుతుంది. ఇక, అతడు పాన్ ఇండియా రేంజ్‌లో నటిస్తే కలెక్షన్లు ఎలా వస్తాయో ఊహించుకోవచ్చు. తాజాగా, దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
