సినిమాలందు డివోషనల్ సినిమాలు వేరయా అని మరోసారి నిరూపించింది ‘మహావతార్ నరసింహ’ అనే సినిమా. నిజానికి, ఈ సినిమాని హోంబాలే ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చేవరకు అసలు ఈ సినిమా ఒకటి ఉందని కూడా ఆడియన్స్‌కి తెలియదు. హోంబాలే ఫ్యాన్ ఇండియా లెవెల్‌లో సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవ్వడం, తెలుగులో గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడంతో సినిమా మీద ఇనిషియల్‌గా డిస్కషన్ జరిగింది. తర్వాత వచ్చిన ట్రైలర్ కూడా పెద్దగా ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించలేకపోయింది.
Also Read:Vachinavadu Gowtham: ఆసక్తికరంగా అశ్విన్ బాబు లుక్
కానీ, సినిమా చూసిన వారంతా సినిమా అద్భుతం అంటూ అబ్బురపడుతూ సోషల్ మీడియాలో మౌత్ టాక్ స్ప్రెడ్ చేయడంతో సినిమాకి ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తాజాగా, ఈ సినిమా ఇప్పటివరకు 53 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టినట్లుగా అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. ఇప్పటివరకు ఈ సినిమా 53 కోట్ల బాక్స్ ఆఫీస్ గ్రాస్ సాధించినట్లు వెల్లడించారు. ఈ సినిమాని క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శిల్పా ధావన్ నిర్మించగా, అశ్విన్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాని హిందీలో అనిల్ తడానికి సంబంధించిన ఏ ఏ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేయగా, ఒక్కొక్క భాషలో ఆయా భాషల్లో సిద్ధహస్తులైన డిస్ట్రిబ్యూటర్ల చేత రిలీజ్ చేయించారు. దీంతో సినిమా మీద అందరి దృష్టి పడడమే కాదు, సినిమా మంచి టాక్‌తో దూసుకుపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కంటే కొన్ని చోట్ల ఈ సినిమా బుకింగ్స్‌లో డామినేట్ చేయడం గమనార్హం. దాదాపు వారం గడుస్తోంది.
