Site icon NTV Telugu

Magic Move Ments: ఘనంగా “మ్యాజిక్ మూవ్ మెంట్స్” టైటిల్ లాంఛ్!

Magic Movements

Magic Movements

తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు) టైటిల్ లాంఛ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు కె. దశరథ్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్లపై తల్లాడ శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.

చిత్ర సమర్పకులు కె. దశరథ్ మాట్లాడుతూ సాయికృష్ణకు సినిమా అంటే చాలా ప్యాషన్ ఉందని, ఆయన వినిపించిన ఈ కథ మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకుంటుందని ప్రశంసించారు. తన వంతు సహకారం అందించేందుకు సమర్పణకు ఒప్పుకున్నట్లు తెలిపారు. హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ తమ ఇంట్లోని సాయిబాబా ఫొటో చూసి ఈ సినిమా స్క్రిప్ట్ ఆలోచన మొదలైందని తెలిపారు. మొదట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, వెంకట్ దుగ్గిరెడ్డి అన్న, తల్లాడ శ్రీనివాస్ గారు, అలాగే దశరథ్ గారి ఆశీస్సులతో ఈ ప్రాజెక్ట్ మొదలైందని పేర్కొన్నారు. ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు డివోషనల్ టచ్ కూడా ఉన్న సినిమా అని, త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. సాయిబాబా ఆశీస్సులు, దశరథ్ సమర్పణలో రూపొందుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్, డివోషనల్ టచ్ ఉన్న చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సాయికృష్ణకు గొప్ప విజయాన్ని అందించాలని చిత్ర యూనిట్ సభ్యులు, అతిథులు ఆకాంక్షించారు.

Exit mobile version