NTV Telugu Site icon

Madhavilatha : జేసి ప్రభాకర్ రెడ్డిపై కఠినంగా వ్యవహరించండి.. మాధవీలత కంప్లైంట్

Madhavilatha

Madhavilatha

జేసి ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేసింది నటి మాధవీలత. కొద్దిరోజుల క్రితం జరిగిన నూతన సంవత్సర వేడుకల గురించి ముందు మాధవీలత కామెంట్ చేయగా దానికి ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాధవి లతా ప్రాస్టిట్యూట్ అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ కామెంట్స్ గురించి మాకి ఫిర్యాదు చేసి ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం అందజేసింది మాధవి లత. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ అంశం మీద మానవ హక్కుల సంఘానికి, పోలీస్ లకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదు, అందుకే ‘మా’కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు, నా ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు అని ఆమె అన్నారు.

Manchu Manoj: విష్ణుకి మనోజ్ ఛాలెంజ్.. నేను ఒక్కడినే ఏ ప్లేస్ కైనా వస్తా!

నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతా, సినిమా వాళ్ళను అందరూ అవమానిస్తారు.. కానీ రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం అని ఆమె అన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అని ఆమె అన్నారు. శివ బాలాజీ మాట్లాడుతూ మాధవిలత గారు చాలా బాధతో ఉన్నారని అర్థమైంది, ఒక మహిళను బాధపెట్టడం కరెక్ట్ కాదు, ఒక పోస్టర్ చూసి అపార్థం చేసుకుని మాట్లాడడం మంచిది కాదు అని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడడం మానేసి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు, ఎంతో మంది యాక్టర్స్ పొలిటిషియన్స్ అయ్యారు. కానీ ఏ పొలిటిషియాన్ కూడా పేరున్న యాక్టర్ కాలేదు అని ఆయన అన్నారు. మేము కెమెరా ముందే నటిస్తాం.. రాజకీయ నాయకులు బయట కూడా నటిస్తారు, ఇండస్ట్రీ జోలికి రాజకీయ నాయకులు రావొద్దు అని ఆయన అన్నారు. ఇక మాధవిలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.