Site icon NTV Telugu

Maareesan: ఫహాద్‌ ఫాజిల్‌ నటించిన కామెడీ థ్రిల్లర్‌.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Maareesan Ott

Maareesan Ott

ఫహాద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మారీశన్’ (Maareesan) సినిమాను జూలైలో థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. అప్పట్లో మంచి టాక్ సంపాదించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల ఆగస్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఆడియోలతో విడుదల కానుండటం విశేషం. సుదీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్‌లో వడివేలు కామెడీ టైమింగ్‌తో పాటు, ఫహాద్ ఫాజిల్ నటన కూడా ప్రధాన హైలైట్స్‌గా నిలిచాయి.

Also Read : Anupama : సెట్‌లో హీరోల‌కు ఇచ్చినంత ఇంపార్టెన్స్.. హీరోయిన్‌లకు ఇవ్వరు

ఇక కథ విషయానికి వస్తే.. దయాలన్‌ (ఫహాద్ ఫాజిల్) అనే దొంగకి, అల్జీమర్స్‌ తో బాధపడుతున్న వేలాయుధం పిళ్లై (వడివేలు) వద్ద చాలా డబ్బు ఉందన్న విషయం తెలుస్తుంది. ఒక సందర్భంలో వేలాయుధం ఊరికి బయలుదేరుతాడు. అదే సరైన సమయం అని భావించిన దయాలన్, మాటలతో అతన్ని మోసం చేసి తన బైక్‌పై తీసుకెళ్తాడు. ఆ ప్రయాణంలో జరిగే అనూహ్య సంఘటనలే సినిమా కథ. దయాలన్ అనుకున్నట్టుగా డబ్బు దోచుకున్నాడా? లేక వేలాయుధం పరిస్థితి తెలుసుకుని వెనక్కి తగ్గాడా? అన్నది కథలోని ట్విస్ట్.

Exit mobile version