Site icon NTV Telugu

కరోనా లాక్ డౌన్ ఎత్తేసే దాకా… ‘క్వారంటైన్’లోనే… శింబు మూవీ!

Maanadu Single Launch Postponed

కోలీవుడ్ స్టార్ హీరో శింబు ‘మానాడు’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దాదాపుగా పూర్తైంది. అయితే, ప్యాండమిక్ సినిమాని డిలే చేస్తోంది. లాక్ డౌన్ వల్ల ఇంకా కొంత భాగం షూటింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలిపోయాయి. అయితే, ఆ మధ్య రంజాన్ సందర్భంగా తొలి సింగిల్ ని విడుదల చేద్దామనుకున్నారు ‘మానాడు’ మూవీ దర్శకనిర్మాతలు. కానీ, సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు తల్లి అకాల మరణం పాలవటంతో రంజాన్ వేళ ఫస్ట్ సాంగ్ రాలేదు. అయితే, లెటెస్ట్ గా ‘మానాడు’ మూవీ నిర్మాత సురేశ్ తన మనసులోని మాటని ట్వీట్ చేశాడు. ‘’మహమ్మారి కారణంగా రోజుకొక చెడు వార్త చెవుల్లో పడుతూనే ఉంది. అందుకే, అందరూ సంతోషకరమైన స్థితిలో లేని ఈ సంక్షోభ సమయంలో ఫస్ట్ సింగిల్ విడుదలని ప్రస్తుతానికి ఆపేయాలనుకుంటున్నాం. కరోనా తగ్గాక లేదంటే ఇప్పుడున్న స్థితి కాస్త తిరిగి సాధారణ స్థాయికి వచ్చాక పాటని విడుదల చేస్తాం అంటూ ఆయన సొషల్ మీడియాలో తెలియజేశారు. శింబుతో పాటూ కళ్యాణీ ప్రియదర్శన్ నటిస్తోన్న ‘మానాడు’ ఎప్పటికీ థియేటర్లకు వస్తుందో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో శింబు అభిమానులు మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదంటున్నాయి చెన్నై సినీ వర్గాలు

Exit mobile version