Site icon NTV Telugu

Jo Sharma :తెలుగు హీరోయిన్ కు అమెరికా ప్రతినిధిగా ‘వేవ్స్ సమ్మిట్ 2025’ ఆహ్వానం

Josharma

Josharma

అంతర్జాతీయ సినీ రంగంలో విజయవంతంగా సాగుతున్న ఎమ్4ఎమ్ (M4M) చిత్ర హీరోయిన్ జో శర్మకు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. ‘వేవ్స్ సమ్మిట్ 2025’ (WAVES Summit 2025)లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) ప్రతినిధిగా పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. కళ, సంస్కృతి, సినిమా రంగాలను వేదికగా వెలుగొందించే ఈ అంతర్జాతీయ సమ్మిట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు.

Read More: Off The Record: గుంటూరులో ఆ నేత వైసీపీకి వెన్నుపోటు పొడిచారు? పదవిని ఎందుకు వదిలేసుకున్నారు?

‘మోటివ్ ఫర్ మర్డర్’ (M4M) అనే థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన జో శర్మ ప్రస్తుతం సినీ ప్రపంచంలో సంచలనంగా మారారు. ఈ చిత్రానికి మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించగా, మోహన్ మీడియా క్రియేషన్స్ మరియు జో శర్మ మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ‘వేవ్స్ సమ్మిట్ 2025’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మే 4, 2025 వరకు నిర్వహించబడే ఈ సమ్మిట్‌లో 90కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు.

Exit mobile version