హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే మరో ఆసక్తికరమైన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 Media మరియు Maha Movies సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం “Production No. 4”గా రూపొందుతోంది. “Inspired by True Events” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా, నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్నదనే ఆసక్తిని పెంచుతోంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్‌తో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పోస్టర్‌లో కనిపిస్తున్న గాఢమైన చీకట్లు, భయానక చిహ్నాలు, మిస్టీరియస్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తూ ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.
ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్, ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు మంచి స్పందన లభించగా, చిత్ర యూనిట్ రేపు అధికారిక టైటిల్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది. ప్రీ లుక్ పోస్టర్‌తో టైటిల్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
